కరోనా.. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మృతుల సంఖ్య..?

433
corona
- Advertisement -

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పటివరకూ 177 దేశాలకు విస్తరించింది. వ్యాధి బారిన 2,20,313 మంది పడగా, ఇప్పటివరకూ నమోదైన మృతుల సంఖ్య 9,800 దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన అన్ని దేశాలూ, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా, ప్రజల సహకారం లేక, వ్యాధి విస్తరిస్తోందని, చైనా తరహాలో వైరస్ అణచివేత కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

నిన్న ఇటలీలో 427, స్పెయిన్ లో 165, ఇరాన్ లో 149 మంది మృతి చెందారని ఇటలీలో మొత్తం మృతుల సంఖ్య చైనాను దాటి 3,500కు చేరువైందని వెల్లడించారు. శుక్రవారం కూడా చైనాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్నారు. కరోనా వైరస్‌ కట్టడే లక్ష్యంగా భారత ప్రభుత్వ సంస్థలు, వేర్వేరు మంత్రిత్వ శాఖలు మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టాయి. ప్రజలు గుమికూడేందుకు ఉన్న అన్ని అవకాశాలను వీలైనంత వరకూ తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టాయి.

- Advertisement -