దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు..!

390
COVID-19
- Advertisement -

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏం జరుగుతుందిలే అనే కేర్‌లెసే ఇప్పుడు ఇటలీ ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. ఈ వైరస్ చైనాలో నుండి వచ్చినా.. దాన్ని కట్టడి చేసి.. అద్భుతమైన విజయాన్ని సాధించారు చైనీయులు. ఇక అన్ని దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పటివరకు ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది.

శనివారం సాయంత్రానికి 870కి పైగా కేసులు నమోదుకాగా, ఈ ఉదయానికి పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 1,029కి పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం, 920 యాక్టివ్ కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతుండగా, 85 మంది రికవరీ అయ్యారు. 24 మంది మరణించారు. రికవరీల విషయంలో మహారాష్ట్ర, యూపీ, హర్యానాలు ముందున్నాయి. మహారాష్ట్రలో 25 మంది వ్యాధిగ్రస్తులు రికవరీకాగా, యూపీ, హర్యానాల్లో 11 మంది చొప్పున వ్యాధి నుంచి బయటపడ్డారు.

ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 186 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. ఆపై రెండో స్థానంలో నిలిచిన కేరళలో 182 మందికి వ్యాధి సోకగా, ఒకరు మరణించారు. కర్ణాటకలో 81, తెలంగాణలో 67, ఉత్తర ప్రదేశ్ లో 65, గుజరాత్ లో 55, రాజస్థాన్ లో 54, ఢిల్లీలో 49, తమిళనాడులో 42, మధ్యప్రదేశ్ లో 39, పంజాబ్ లో 38, హర్యానాలో 35, జమ్ము కశ్మీర్ లో 33 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 19, పశ్చిమ బెంగాల్ లో 18, లడ్డాక్ లో 13, బీహార్ లో 11, అండమాన్ దీవుల్లో 9, చండీగఢ్ లో 8, చత్తీస్ గఢ్ లో 7, ఉత్తరాఖండ్ లో 6, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో 3, మణిపూర్, మిజోరం, పుదుచ్చేరిల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

- Advertisement -