కరోనా.. తెలంగాణ సరిహద్ధులు బంద్‌..

245
Coronavirus
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువగా వైరస్‌ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అన్నిమార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ఉమ్మడి అదిలాబాద్‌లో జిల్లాతో మహారాష్ట్రకు ఉన్న సరిహద్దు ప్రాంతాలపై మరింత నిఘా పెట్టారు. బాసర, ధర్మాబాద్‌ వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దును మూసివేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన 37 మంది ఇటీవల ఖతార్‌ నుంచి వచ్చారు. వీరంతా జహీరాబాద్‌ జిల్లా చిరాజ్‌పల్లి చెక్‌పోస్టు మీదుగా తెలంగాణలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో మహారాష్ట్రాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 74కు చేరడంతో ప్రభుత్వం ఏ విషయంలోనూ రాజీపడడం లేదు.

- Advertisement -