తెరచుకున్న ఆలయాలు..కరోనా ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది..!

552
coronavirus express
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరాలు చాస్తున్న నేపథ్యంలో ఫన్నీ జోకులు, మీమ్స్ సోషల్ మీడియాలో హల్ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 1 నుండి లాక్ డౌన్ 5 వరకు జరుగుతున్న పరిణాలు, పలువురు నేతలు మాట్లాడిన మాటలకు ఫన్నీ మీమ్స్ జోడించి నెటిజన్లు నవ్వులు పూయించారు.

ఇక తాజాగా ఇవాళ్టి నుండి కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రార్ధనా మందిరాలు తెరచుకున్నాయి. దీనిపై ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

నేటి నుండి ప్రార్ధన మందిరాలు తెరచుకున్నాయి…మేముకూడా వస్తున్నాం అంటూ ఓ బస్‌ పోస్టర్‌ని డిజైన్ చేసి అవేర్ నెస్ కల్పిస్తున్నారు నెటిజన్లు. కరోనా ఎక్స్‌ప్రెస్‌ పేరుతో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌లో నేటి నుండి ఆలయాలు, మసీదులు,చర్చిల టూర్ ఉందని బస్సు నిండా కరోనా వైరస్‌ వచ్చేస్తుందని డిజైన్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో వీటిని తెరిస్తే పరిస్థితి మరింత విజృంభించే అవకాశం ఉందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తూంటే మరికొంతమంది ఇవాళే ఆలయాలు తెరుచుకున్నాయి కదా అని ఎగేసుకుని రాకండంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -