2 లక్షల 66వేలకు చేరుకున్న కరోనా కేసులు..

235
india coronavirus cases
- Advertisement -

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9987 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 331 మంది మృతిచెందగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,66,598కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 7,466 మంది మృతిచెందగా కరోనా నుంచి ఇప్పటివరకు 1,29,215 మంది కోలుకున్నారు. దేశంలో 1,29,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 71,93,476 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. ఇందులో 4,08,614 మందికిపైగా బాధితులు మరణించారు.

అమెరికాలో గత 24 గంటల్లో 18,663 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అమెరికాలో 20,26,493 కేసులు నమోదుకాగా 1,13,055 మంది బాధితులు మరణించారు. రష్యాలో కరోనా కేసుల సంఖ్య 4,76,658కి చేరగా ఇప్పటివరకు 5971 మంది మరణించారు.

- Advertisement -