ఏపీలో కొత్తగా 1,593 కరోనా పాజిటివ్ కేసులు..

167
corona
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 80,737 కరోనా టెస్టులు నిర్వహించగా 1,593 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు 8,51,298 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,24,189 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,262 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,847కి చేరింది.

పాజిటివ్ కేసులలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 259 కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరంలో 42 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో మృతి చెందగా, 2,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

- Advertisement -