కరోనా వైరస్ విజృంభించడం కారణంగా ఆస్ట్రేలయాలో లాక్‌డౌన్ పెట్టారు. లాక్‌డౌన్ వల్ల ఆస్ట్రేలియాలో నివసించే ఎంతో మంది భారతీయ విద్యార్థులు వారి జీవనోపాధి కోల్పోయి,నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి విద్యార్థుల కష్టాలను గుర్తించి మేము ఉన్నాము అంటూ ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ బై రెడ్డి మరియు సభ్యులు ముందుకు వచ్చారు.
వీరు సుమారు 200 మందికి నిత్యావసర సరుకులను అందించి వారి మనవతదృక్పడని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా తెలంగాణ అస్సోషియేషన్ ఆధ్యక్షుడు అనిల్ బై రెడ్డి మరియు అస్సోషియేషన్ సభ్యులు ఫానికుమర్, కిరణ్,వంశీకొట్టల,కృష్ణ వడియల,రవి దామర,రఘు,పుల్లారెడ్డి, ప్రవీణ్ దేశం,అమర్,రాజవర్ధన్ రెడ్డి,మహేష్,సతీశ్‌లు పాల్గొన్నారు.
అలాగే విద్యార్థులు వారి ఇమ్మిగ్రేషన్ సమస్యలకు సంబంధించిన వివరాలను తెల్సుకోవడం కోసం త్వరలో ఉచిత కన్సల్టేషన్ ఎర్పాటు చేయడం జరుగుతుంది అని అధ్యక్షుడు అనిల్ బై రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయసకారాలు అందించిన తెలంగాణ మరియు తెలుగు అసోసియేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.