కరోనా..శారదా పీఠాధిపతి ఆసక్తికర వ్యాఖ్యలు..!

247
sharada peetam
- Advertisement -

కరోనా నేపథ్యంలో దేశంలో మే 3 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట వ్యూహాలను అమలు చేస్తుండగా విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశంలో మే 5 తర్వాత కరోనా తగ్గుముఖం పడుతుందని జోస్యం చెప్పారు. భారత్ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో చూసిందని..కరోనా గురించి నైరాశ్యం చెందవద్దన్నారు.

ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోందని… ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుందన్నారు. కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో ఆ ప్రభావం తగ్గుతుందని…కరోనా ప్రభావాన్ని నివారించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించాం అని వెల్లడించారు.

- Advertisement -