తెలంగాణలో 30కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

318
corona test labs
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు 30మందకి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ప్రకటించారు. కరీంనగర్ లో ఇండొనేషియా బృందం తిరిగిన సంగతి తెలిసిందే. అయితే వాళ్లతో తిరిగిన కరీంనగర్ వ్యక్తికి కూడా కరోనా వచ్చినట్లు తేలిందని తెలిపింది.

రాష్ట్రానికి లండన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకిందని, ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన మరో 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిపింది. దేశంలో ఇవాళ్టీ వరకు 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలిపింది ఆరోగ్యశాఖ. అత్యధికంగా మహారాష్ట్రలో 89మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇండియాలో ఇప్పటివరకు 7గురు మృతిచెందారు. మరోవైపు కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈనెల 31వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.

- Advertisement -