ప్రజలందరూ సహకరించాలి- మంత్రి ఈటెల

379
elela
- Advertisement -

కరోనా వ్యాప్తి నియంత్రణపై నేడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ నగరంలోని కోఠి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా WHO హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ 19 వైరస్ ని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ప్రయివేటు వైద్య కళాశాలల్లో 15,040 పడకలు ఉన్నాయని తెలిపారు. పీపీ కిట్లు, శానిటైజేషన్‌కు సంబంధించిన అంశాలపై చర్చించామని మంత్రి తెలిపారు. పీజీ వైద్య విద్యార్థుల సేవలతో పాటు నర్సింగ్‌, పారామెడికల్‌ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు. అవసరం లేని రోగులను ఆస్పత్రుల్లో ఉంచుకోవద్దు అని సూచించారు. ఒక్కో ప్రయివేటు ఆస్పత్రికి ఆర్డీవో స్థాయి అధికారిని నియమిస్తామని మంత్రి చెప్పారు. ప్రజలకు ఏం అవసరం ఉన్నా వాటిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

ప్రయివేటు హాస్పిటల్స్ లో ఎలెక్టీవ్ సర్జరీ లను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశాము. కోవిడ్ 19 పేషెంట్స్ కి ప్రయివేటు హాస్పిటల్స్ లో కూడా ట్రీట్మెంట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.. ప్రయివేటులో వీటికోసం సపరేటుగా ఓపీ కౌంటర్ ఏర్పాటు చేయాలి. శ్వాశ సంబంధిత వ్యాధులతో వస్తే వారికి కూడా ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో వైద్యం అందించాలి. ఇటువంటి బాధితులు ఎవరైనా వస్తే ఏపీడిమిక్ సెల్ కి ఆయా ఆస్పత్రులు సమాచారం అందించాలి.. ఏపీడిమిక్ సెల్ నెంబర్ 040 -24651119 కి కాల్ చేసి తెలపాలి.వారి శాంపిల్ ని గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు మంత్రి ఆదేశించారు. ఎవరికైనా పాజేటివ్‌ అని వస్తే వారిని అక్కడే ఉన్న ఐసోలాషన్ వార్డ్ లో ట్రీట్మెంట్ అందించాలి,ఇతర ఆసుపత్రులకు తరలించ వద్దు అని మంత్రి ఈటెల ఆదేశాలు జారీ చేశారు.

సికింద్రాబాద్లో, కరీంనగర్లో సెకండ్ స్టేజ్ లోకి వైరస్ వ్యాప్తి చేరుకున్న నేపథ్యంలో మిగతా వారికి వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలను మంత్రి ఈటల మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రివెన్షన్ మాత్రమే మనల్ని రక్షిస్తుంది. వైరస్ వ్యాప్తి జరిగిన తర్వాత అదుపు చేయడం కష్టం. అందుకే ఆర్థికంగా ఎంత నష్టం జరిగినా ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ బాధ్యత కాబట్టి రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించామని మంత్రి అన్నారు. దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -