ఇటలీ-అమెరికాలో కరోనా కల్లోలం..

409
Italy
- Advertisement -

ప్రజలు కరోనా వైరస్‌ను సాదారణ విషయం అనుకుంటున్నారు. దాంతో కరోనా వైరస్ మరింత బలంగా వ్యాపిస్తోంది ఇప్పటికే ప్రపంచంలో పలు దేశాలు దీని దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 30 వేలకి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. అలాగే 6,60,0064 కేసులు నమోదు కాగా.. వీరిలో 14,1422 మంది కోలుకున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలు చైనా తర్వాత ఇటలీ,స్పెయిన్ అమెరికాలో నమోదు అయ్యాయి.

ప్రస్తుతం ఇటలీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇటలీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 92,472కి చేరింది. శనివారం అక్కడ కొత్తగా 5,974 మంది కరోనా బారిన పడ్డారు. శనివారం ఒక్కరోజే ఇటలీలో 889 మంది చనిపోవడంతో.. మృతుల సంఖ్య 10,023కి చేరింది. కాగా ప్రపంచంలోనే ఇటలీలోనే కరోనాతో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి.

ఇక స్పెయిన్‌లో శనివారం కొత్తగా 7513 కేసులు నమోదవడంతో… మొత్తం కేసుల సంఖ్య 73232కి చేరింది. శనివారం 844 మంది చనిపోవడంతో… మృతుల సంఖ్య 5982కి చేరింది. ప్రస్తుతం అమెరికాలో శనివారం కొత్తగా 16917 కేసులు నమోదవ్వడంతో… ఆ దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 121043 అయ్యింది. అమెరికాలో కొత్తగా 324 మంది చనిపోవడంతో… మృతుల సంఖ్య 2020 అయ్యింది.

- Advertisement -