కరోనా కట్టడికి కోరమండల్ ఫర్టిలైజర్స్ కోటి విరాళం..

48
kcr cm

కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచింది కోరమండల్ ఫర్టిలైజర్స్ సంస్థ. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోరమండల్ ఫర్టిలైజర్స్ సంస్థ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ వైస్ ప్రెసిడెంట్ కె. సత్యనారాయణ, ఎం.డి సమీర్ గోయల్ లు ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కె. చంద్రశేఖర్ రావును కలిసి అందజేశారు.ఈ సంద‌ర్భంగా కోరమండల్ ఫర్టిలైజర్స్ సంస్థ ప్ర‌తినిధుల‌కు సీఎం కేసీఆర్‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.