వాట్సాప్‌పై వివాదం..మెటా కౌంటర్!

7
- Advertisement -

టెక్ ప్రపంచంలో మరోసారి డేటా భద్రతపై చర్చ మొదలైంది. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్, టెలిగ్రామ్ సీఈఓ పావెల్ ధృవ్ … వాట్సాప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వినియోగదారులు ఈ యాప్‌ను పూర్తిగా నమ్మకూడదని వారు వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.

ఇటీవల, వాట్సాప్‌ సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, పావెల్ డ్యూరోవ్ సోషల్ మీడియా వేదికలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2026లో కూడా వాట్సాప్ సురక్షితం అని నమ్మాలంటే చాలా అమాయకంగా ఉండాలి అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. టెలిగ్రామ్ చేసిన విశ్లేషణలో వాట్సాప్ ఎన్క్రిప్షన్‌లో పలు బలహీనతలు కనిపించాయని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో ఎలాన్ మస్క్ కూడా వాట్సాప్ భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ, అది పూర్తిగా సురక్షితం కాదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ విమర్శల నేపథ్యంలో, వాట్సాప్‌కు చెందిన మెటా సంస్థ గట్టి కౌంటర్ ఇచ్చింది. అయితే మెటా ప్లాట్‌ఫామ్స్‌ ప్రతినిధులు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. వాట్సాప్ సందేశాలు సురక్షితం కావని చెప్పడం పూర్తిగా అసత్యం, అసంబద్ధమైన ఆరోపణ అని పేర్కొన్నారు.

ALso Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం

మెటా ప్రకారం, వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ (E2EE) దశాబ్దంగా ఉపయోగంలో ఉంది. ఈ సాంకేతికత వల్ల పంపిన వ్యక్తి మరియు స్వీకరించిన వ్యక్తి తప్ప మరెవరూ సందేశాలను చదవలేరని సంస్థ స్పష్టం చేసింది.అయితే, ఈ వివాదానికి కారణమైన ఒక కేసు కూడా ప్రస్తుతం అమెరికాలో నడుస్తోంది. ఆ కేసులో, వాట్సాప్ వినియోగదారుల సందేశాలను సేకరించి విశ్లేషిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -