హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరు ORR పై రోడ్ ప్రమాదం జరుగగా అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది ఎమ్మెల్యే కారు. దీంతో కారు లో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇటీవల నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో కూడా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది.ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
గతేడాది ఫిబ్రవరి నెలలోనే ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇప్పుడు కుమార్తె ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుండి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు లాస్య నందిత. సాయన్న కుటుంబంలో వరుస విషాద చాయలతో బీఆర్ఎస్ శోకసంద్రంలో మునిగిపోయారు.
Also Read:పుచ్చకాయ గింజలతో ఉపయోగాలు..