నేటి రోజుల్లో ఎక్కువ మందిని వేధించే ఆరోగ్య సమస్యలలో మలబద్ధకం కూడా ఒకటి. జీర్ణ సంబంధిత సమస్యగా ఏర్పడే మలబద్ధకం వల్ల ఇతరత్రా సమస్యలు కూడా ఉత్పన్నమౌతు ఉంటాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా మలబద్దకం సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. ఈ సమస్య రావడానికి ఆహారపు అలవాట్లు ఒక కారణమైతే.. మన జీవన శైలిలోని మార్పులు కూడా మరో కారణం. రోజంగా కూర్చొని పని చేయడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్ధకం ఉన్నవారిలో మలవిసర్జన చాలా కష్టంగా ఉంటుంది. అంతే కాకుండా రోజంతా నిరుత్సాహం, బద్దకం వంటివి ఆవహిస్తాయి. .
ఇంకా ఆకలి మందగించడం, కడుపు నిండుగా ఉన్న భావన కలగడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇంకా మలబద్దకం తీవ్రత అధికంగా ఉంటే ప్రేగు క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మలబద్ధకం నుంచి బయట పడేందుకు మెడిసిన్స్ తీసుకోవడం కంటే సహజసిద్దంగా కొన్ని చిట్కాలు సూచనలు పాటించి దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మలబద్ధకాన్ని దూరం చేయడంలో శారీరక శ్రమ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల కడుపులోని కండరాలు ఉత్తేజానికి లోనవుతాయి.
తద్వారా మలబద్దకం దూరమౌతుంది. ఇంకా నీళ్లు అధికంగా తాగడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు తాగితే మోషన్ ఫ్రీగా మరి మలబద్ధకం దరిచేరదు. వీటితో పాటు తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఐస్ క్రీమ్, చిప్స్, చీజ్, మాంసం, పిజ్జాలు వంటివి మలబద్దకాన్ని పెంచే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. ఇంకా వైట్ రైస్, చాక్లెట్, బ్లాక్ టి వంటివి కూడా మలబద్దకానికి కారణమౌతాయి. కాబట్టి ఆహార డైట్ లో వాటిని తగ్గించాలి. ఇక ఆహారంలో భాగంగా కూరగాలను ఎక్కువగా తినాలి. బీట్ రూట్, ముల్లంగి, బీన్స్, క్యారెట్, క్యాబేజీ వంటివి ప్రతిరోజూ తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read:గీతాంజలి మళ్ళీ వచ్చింది..పెద్ద హిట్ అవ్వాలి