చాపకింద నీరులా బి‌ఆర్‌ఎస్‌ లో చేరికలు?

31
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది పార్టీ పిరాయింపుల అంశం హాట్ టాపిక్ అవుతోంది. చాలమంది నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్ జపాంగ్ షురూ చేస్తున్నారు. ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ లో చేరేందుకు కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి పలువురు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. కర్నాటక ఎన్నికల తరువాత తెలంగాణలో బీజేపీ కొంత స్లో అయింది. అంతే కాకుండా ఈ మద్య అంతర్గత విభేదాలతో ఆ పార్టీ సతమతమౌతోంది. దాంతో ఆ పార్టీలోని నేతలు అధికార బి‌ఆర్‌ఎస్ గూటికి చేరేందుకు మార్గం వెత్తుకుంటున్నారు. ఇటు హస్తం పార్టీ ఈ మద్య కొంత హడావిడి చేస్తున్నప్పటికి అది పై పైనే అనేది స్పష్టమౌతోంది. .

ఎందుకంటే కాంగ్రెస్ లోని చాలమంది నేతలు బి‌ఆర్‌ఎస్ తో టచ్ లో ఉంటున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నేతలు చేజారిపోకుండా టి కాంగ్రెస్ పైకి ఢాంబికం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. బి‌ఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు లు కాంగ్రెస్ లో చేరడంతో.. బి‌ఆర్‌ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని నేతల్లో దైర్యం నింపే ప్రయత్నం చేస్తోంది టి కాంగ్రెస్ నాయకత్వం. కానీ వాస్తవానికి పరిస్థితి అలా లేదు.

Also Read:వామ్మో ఏపీ.. మళ్ళీ అప్పా?

కాంగ్రెస్ నుంచే బి‌ఆర్‌ఎస్ వైపు మల్లుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న నేతలు.. అలాగే పదవుల్లోనూ, సీట్ల విషయంలోనూ అసంతృప్తిగా ఉన్న చాలా మంది నేతలు అధికార బి‌ఆర్‌ఎస్ వైపు చూస్తున్నాట్లు తెలుస్తోంది. తాజాగా భువనగిరి డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బి‌ఆర్‌ఎస్ లో చేరారు. ఇంకా మరికొంత మంది నేతలు కుగా గులాబీ గూటికి చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక ఈ మద్య కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కూడా బి‌ఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్లు టాక్. మొత్తానికి మొత్తానికి ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది అధికార బి‌ఆర్‌ఎస్ వైపు చేరికలు భారీగానే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:ఈ తెలుగు బ్యూటీ వాటికీ రెడీ!

- Advertisement -