కాంగ్రెస్‌-బీజేపీ కలిసి నన్ను ఓడించేందుకు కుట్ర..:కవిత

247
mp kavitha
- Advertisement -

నిజామాబాద్‌లో తనను ఓడించేందుకు కాంగ్రెస్,బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత. ఎన్నికలున్నప్పుడు మాత్రమే ఈ రెండు పార్టీలు గ్రామాల్లోకి వస్తాయని మండిపడ్డారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత పసుపు బోర్డు ఇచ్చే అవకాశం ఉన్నా.. ప్రధాని నరేంద్రమోడీ ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తామంటే ఏ రకంగా నమ్మాలని ప్రశ్నించారు.

బీజేపీ ఐదేళ్లలో ఏ ఒక్క సమస్యలను పరిష్కరించలేదన్నారు. తెలంగాణను అభివృద్ధి ఎవరు చేశారో ఆలోచించి ఓటు వేయాలని, బీజేపీ మాటలు నమ్మి యువత బలికావద్దన్నారు.జగిత్యాలను కరీంనగర్‌కు ధీటుగా తయారు చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను బాధ్యతగా నెరవేర్చేది టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎన్నికలకు ముందే పారిపోయిండని ఎద్దేవా చేశారు.

మతాలు, కులాల మధ్య బీజేపీ గొడవలు సృష్టిస్తుందోని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేది కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే. బోర్డర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ ఐదేళ్ల కాలంలో సైనికులు, పౌరులు మృతి చెందారని మండిపడ్డారు కవిత.

బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసినా వాటిని కేంద్రం నెరవేర్చడం లేదన్నారు కవిత. నిరంతరం మన హక్కుల కోసం ఢిల్లీలో నిలబడి, పోరాడి, కొట్లాడి సాధించుకుంటున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -