కాంగ్రెస్ vs బీజేపీ.. 17,18 తేదీల్లో జరిగేదేంటి?

45
- Advertisement -

2024 ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని హస్తం పార్టీ భావిస్తుంటే.. మూడో సారి కూడా విజయం సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు అమలు చేస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే ఐక్యతే ప్రధాన ఆయుధంగా కాంగ్రెస్ సిద్దమైంది. బీజేపీ యేతర పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చి కమలం పార్టీకి చెక్ పెట్టాలని చూస్తోంది హస్తం పార్టీ. ఇప్పటికే ఐక్యత విషయంలో కాంగ్రెస్ వేస్తున్న ప్రతి అడుగు సక్సస్ అవుతోంది. గత నెలలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన పాట్నాలో విపక్షాల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. .

ఈ సమావేశం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉందనేది బహిరంగ రహస్యం. పేరుకు నితీశ్ కుమార్ విపక్షాల ఐక్యత కొరకు ప్రయత్నిస్తున్నప్పటికి కాంగ్రెస్ డైరెక్షన్ లోనే ఆయన అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నా మాట. ఇక ఇప్పుడు మరోసారి విపక్ష పార్టీలతో సమావేశం కొరకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 17 న విపక్ష నేతల సంయుక్త సమావేశాన్ని ముంబైలో నిర్వహించ నుంచి కాంగ్రెస్. ఈ సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా హాజరవుతారని తెలుస్తోంది.

Also Read:ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్‌ది కాదా?:జగదీష్ రెడ్డి

పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో 22 పార్టీల అధినేతలు హాజరయ్యారు. ఇప్పుడు వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. ఇక అటు బీజేపీ కూడా తమకు మద్దతు తెలిపే పార్టీలతో ఎన్డీయే మిత్రపక్ష కూటమిని ఈ నెల 18న నిర్వహించనుంది. ఈ సమావేశంలో హాజరయ్యేందుకు ఇప్పటికే ఎన్డీయే సానుభూతి పార్టీల అధినేతలకు ఆహ్వానాలు కూడా అందాయి. అటెమో కాంగ్రెస్ 17 న విపక్షాలతో బేటీ.. ఇటెమో 18న మిత్రపక్షాలతో బీజేపీ బేటీ.. దీంతో రాబోయే రెండు రోజులు దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి 17, 18 తేదీల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:పవన్ లేకుండానే OG!

- Advertisement -