మునుగోడులో కాంగ్రెస్ ఓటమి ఖాయం: ఎంపీ కోమటిరెడ్డి

241
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయే సీటుకు ప్రచారం ఎందుకని….తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడులో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెంకట్ రెడ్డి….మునుగోడులో తాను వెళ్లి ప్రచారం చేసినా మరో 10 వేల ఓట్లు పెరుగుతాయే తప్ప.. కాంగ్రెస్‌ గెలవదన్నారు. ఫైనాన్షియల్‌గా కాంగ్రెస్‌ వీక్‌గా ఉందని… రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు మనమేం చేయగలుగుతాం అన్నారు.

నియోజకవర్గంలో పాదయాత్ర చేద్దామనుకున్నా. కానీ కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపు. తాను 25 ఏండ్లు రాజకీయాల్లో ఉన్నాను. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీగా చేస్తున్నాను. ఇక నాకు రాజకీయాలు చాలు అని తెలిపారు.

- Advertisement -