టీఆర్ఎస్‌లో విలీనం కానున్న కాంగ్రెస్..

283
Congress
- Advertisement -

టీ కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ నుండి తాజాగా మరో ముగ్గురు శాసనసభ్యుల నుంచి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లోకి చేరానున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, పొడెం వీరయ్య, జగ్గారెడ్డి కారెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ సీఎల్పీ విలీనానికి సర్వం సిద్ధమయింది.

అయితే కాంగ్రెస్‌ శాసనసభాపక్ష విలీనానికి 13 మంది సభ్యులు అవసరం కాగా… త్వరలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నందున విలీనానికి అవసరమైన బలం చేకూరుతుందని, ఆ వెంటనే సన్నాహాలు పూర్తవుతాయని అధిష్ఠానం వెల్లడించింది. రూపొందిన కార్యాచరణ ప్రకారం కాంగ్రెస్‌ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలుస్తారు.

Congress

ఆ వెంటనే శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో భేటీ అయి విలీన లేఖ ఇస్తారని తెలిసింది. 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ సిద్ధం చేశారు. ఇక తెదేపా శాసనసభాపక్ష విలీనం గురించి కూడా సండ్రతో తెరాస చర్చించింది. అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెరాసలో చేరని పక్షంలో సండ్ర ఒక్కరే తెదేపా శాసనసభాపక్షాన్ని విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

తెరాస శాసనసభాపక్షంలో విలీనం కావడం ఖాయమని, కాంగ్రెస్‌లో చివరికి ముగ్గురు ఎమ్మెల్యేలే మిగులుతారని ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియలు వెల్లడించారు. అధిష్ఠానంతో చర్చించిన అనంతరం ఆదివారం హైదరాబాద్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. మూడు, నాలుగు రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి అవుతుందని, విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. తెరాసలో చేరాలనే తమ నిర్ణయాన్ని నియోజకవర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు.

Congress

కాంగ్రెస్ పార్టీకి చెందిన రేగా కాంతారావు, హరిప్రియానాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు, చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జాజుల సురేందర్, బీ హర్షవర్ధన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించారు.

- Advertisement -