ముసుగులో దోస్తీ.. ఇంకెన్నాళ్ళు?

45
- Advertisement -

టీడీపీ- కాంగ్రెస్ , కాంగ్రెస్ -బిజెపి, బీజేపీ- టీడీపీ.. ఇలా ఈ మూడు పార్టీల చుట్టూ పొత్తు ఊగిసలాడుతోంది. తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ మధ్య అంతర్గత ఒప్పందాలు ఉన్నాయనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్న అంశం. గత కొన్నాళ్లుగా బీజేపీ కాంగ్రెస్ మద్య దోస్తీ ఉందని, పైకేమో కారాలు మిరియాలు నూరుతున్నారనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలకు మోడీ సర్కార్ అండగా నిలబడడం, ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నా కాంగ్రెస్ నేతలు, బీజేపీ పై ఇంతవరకు ఎలాంటి విమర్శలు చేయకపోవడం వంటి అంశాలను పరిశీలిస్తే బీజేపీ కాంగ్రెస్ మధ్య అంతర్గత దోస్తీ ఉందనే సంగతి ఇట్టే బయటపడుతుంది. ఇప్పుడు తాజాగా టీడీపీ విషయంలో కూడా ఇదే తరహా అంశం బయటకు వస్తోంది. మొదట తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ఆ తరువాత అనూహ్యంగా రేస్ నుంచి తప్పుకుంది టీడీపీ. .

ఆ పార్టీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడానికి కారణలేవైనప్పటికి, ప్రస్తుతం మాత్రం ఆ పార్టీ కాంగ్రెస్ కు పరోక్ష మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొంతమంది కాంగ్రెస్ నేతలు టీడీపీ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అసలు రేస్ లో లేని పార్టీ పై హస్తం నేతలు ఎందుకు మద్దతు పలుకుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తానుకు టీడీపీ పై అభిమానం ఉండే విషయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన గెలుపు టీడీపీకి మేలు చేస్తుందని ఇటీవల వ్యాఖ్యానించి హాట్ టాపిక్ అయ్యారు.

ఇక ఇప్పుడు భట్టి విక్రమార్క ఏకంగా టీడీపీ కండువా మెడలో వేసుకొని అందరినీ ఆశ్చర్య పరిచారు. ఎర్రుపాలెం మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ శ్రేణులతో కలిసిన భట్టి విక్రమార్క టీడీపీ కండువా మెడలో వేసుకొని ప్రచారం చేశారు. ఇలా కాంగ్రెస్ లోని కీలక నేతలంతా టీడీపీ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుండడంతో పరోక్షంగా ఇరు పార్టీలు పొత్తులో ఉన్నాయనే సంగతి ఇట్టే భాహిర్గతం అవుతోంది. ఇలా బీజేపీ కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ముసుగులో దోస్తీ కొనసాగిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయా ఆంటే అవుననే అంటున్నారు రాజకీయ అతివాదులు. మరి ఈ ముసుగులో దోస్తీ ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తాయో చూడాలి.

Also Read:Mehreen:‘స్పార్క్’ మూవీ అందరిని మెప్పిస్తుంది

- Advertisement -