సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది కాంగ్రెస్. 56 మందితో మూడో జాబితాను రిలీజ్ చేయగా రాష్ట్రం నుండి ఐదుగురికి చోటు దక్కింది. సికింద్రాబాద్ నుండి ఎమ్మెల్యే దానం నాగేందర్, పెద్దపల్లి నుండి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్‌గిరి నుండి సునీతా మహేందర్ రెడ్డి, చేవేళ్ల నుండి ఎంపీ రంజిత్ రెడ్డి,నాగర్‌కర్నూల్ నుండి మల్లు రవికి టికెట్ కేటాయించారు.
దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 17 సీట్లకు గాను 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగితా 8 స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తోంది కాంగ్రెస్. ఇక తొలి జాబితాలో నలుగురు నల్గొండ నుండి రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుండి వంశీచంద్‌రెడ్డి, జహీరాబాద్ నుండి సురేశ్ షెట్కార్, మహబూబాబాద్ నుండి బలరాం నాయక్ పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా జాబితాలో కర్ణాటక(17), గుజరాత్(11), పశ్చిమ బెంగాల్(8), మహారాష్ట్ర(7), రాజస్థాన్(6), తెలంగాణ(5), అరుణాచల్‌ప్రదేశ్(2), పుదుచ్చేరిలో ఒక సీటుకు అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి బెహరాంపూర్ నుంచి పోటీ చేయనున్నారు. గుల్బర్గా నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణా దొడ్డమణి పోటీ చేయనున్నారు.
Also Read:లిక్కర్ స్కాం..సీఎం కేజ్రీవాల్ అరెస్ట్