దిగ్విజయ్ ఔట్…కుంతియా ఇన్‌

197
Congress removes Digvijaya as party TS incarge
- Advertisement -

మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయన స్థానంలో మరో సీనియర్‌ నేత, కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి అయిన రామచంద్ర కుంతియా(ఆర్‌.సి. కుంతియా)ను నియమిస్తూ ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) ప్రకటనను విడుదల చేసింది.

సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కాగా, గత కొంతకాలంగా దిగ్విజయ్ వ్యవహారాలపై టీఎస్ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ డిగ్గీ రాజాను తెలంగాణ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది.

తన పదవీ కాలంలో దిగ్విజయ్‌  పని తీరుతో కంటే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఐసిస్‌ సానుభూతిపరుల విషయంలో, ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్‌ రాకెట్‌ కేసులోనూ డిగ్గీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో పార్టీ సైతం ఇరుకున పడేలా వ్యవహించిన ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని ఉన్న పళంగా తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -