కాంగ్రెస్ పార్టీ 65 మందితో కూడిన మొదటి జాబితాను సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి అనేక మల్లగుల్లాల అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ అధికారికంగా జాబితాను ప్రకటించారు. రద్దయిన శాసనసభలో కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 14 మంది ఎమ్మెల్యేలకు తొలి జాబితాలో చోటు దక్కింది. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, పోరిక బలరాం నాయక్,కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి,సర్వే సత్యనారాయణ,మల్లు రవిలకూ అవకాశం లభించింది.
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. జాబితా విడుదలపై సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జాబితా ఖరారుకు సంబంధించి సోమవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ భక్తచరణ్‌దాస్, సభ్యులు శర్మిష్ఠ ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు,శ్రీనివాసన్ కృష్ణన్,సలీం అహ్మద్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు.
65 మందితో కూడిన మొదటి జాబితా..
1) సిర్పూర్ – పాల్వాయి హరీశ్‌బాబు
2) చెన్నూరు – బోర్లకుంట వెంకటేశ్ నేత
3) మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు
4) ఆసిఫాబాద్ – అత్రం సక్కు
5) ఆదిలాబాద్ – గండ్రత్ సుజాత
6) నిర్మల్ – ఎలేటి మహేశ్వర్‌రెడ్డి
7) ముథోల్ – రామారవు పటేల్
8) ఆర్మూర్ – ఆకుల లలిత
9) బోధన్ – సుదర్శన్‌రెడ్డి
10) జుక్కల్ – సౌదాగర్ గంగారాం
11) బాన్స్‌వాడా – కూసల బాలరాజు
12) కామారెడ్డి – షబ్బీర్ అలీ
13) జగిత్యాల – జీవన్‌రెడ్డి
14) రామగుండం – ఎమ్మెస్ రాజ్ ఠాకూర్
15) మంథని- దుద్దిళ్ల శ్రీధర్ బాబు
16) పెద్దపల్లి – సి. విజయరామారావు
17) కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
18) చొప్పదండి – సత్యం మేడిపల్లి
19) వేములవాడ – ఆది శ్రీనివాస్
20) మానకొండూర్ – ఆరెపల్లి మోహన్
21) ఆంధోల్ – దామోదర్ రాజనరసింహ
22) నర్సాపూర్ – సునితా లక్ష్మారెడ్డి వాకిటి
23) జహీరాబాద్ – గీతారెడ్డి
24) సంగారెడ్డి – జగ్గారెడ్డి( తూర్పు జయప్రకాశ్‌రెడ్డి)
25) గజ్వెల్ – ఒంటేరు ప్రతాప్‌రెడ్డి
26) కుత్బుల్లాపూర్ – కున శ్రీశైలంగౌడ్
27) మహేశ్వరం – పి. సబితా ఇంద్రారెడ్డి
28) చేవెళ్ల – కేఎస్ రత్నం
29) పరిగి – టి. రామ్మోహన్‌రెడ్డి
30) వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
31) తాండూర్ – రోహిత్ రెడ్డి
32) ముషీరాబాద్ – అనిల్ కుమార్ యాదవ్
33) నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
34) గోషామహల్ – ముఖేశ్ గౌడ్
35) చార్మినార్ – మహమ్మద్ గౌస్
36) చంద్రాయన్‌గుట్ట – ఈసా బినోబాయి
37) సికింద్రాబాద్ – సర్వే సత్యనారాయణ
38) కొడంగల్ – రేవంత్‌రెడ్డి
39) జడ్చర్ల – మల్లు రవి
40) వనపర్తి – జి చిన్నారెడ్డి
41) గద్వాల్ – డీకే అరుణ
42) అలంపూర్ – సంపత్‌కుమార్
43) నాగర్‌కర్నూల్ – నాగం జనార్ధన్‌రెడ్డి
44) అచ్చంపేట – సీహెచ్ వంశికుమార్
45) నాగార్జునసాగర్ – జానారెడ్డి
46) హుజూర్ నగర్ – ఉత్తమ్‌కుమార్ రెడ్డి
47) కోదాడ – పద్మావతిరెడ్డి
48) సూర్యపేట – దామోదర్‌రెడ్డి
49) నల్లగొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
50) మునుగోడు – రాజగోపాల్‌రెడ్డి కోమటిరెడ్డి
51)భువనగిరి – అనిల్‌కుమార్‌రెడ్డి
52) నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య
53) ఆలేరు – బిక్షమయ్యగౌడ్
54) కల్వకూర్తి – వంశీ చంద్ రెడ్డి
55) స్టేషన్ ఘన్‌పూర్ – సింగాపూర్ ఇందిరా
56) పాలకూర్తి – జంగా రాఘవరెడ్డి
57) డోర్నకల్ – రామచంద్రు నాయక్
58) మహబూబాబాద్ – బలరాం నాయక్
59) నర్సంపేట – దొంతి మాదవరెడ్డి
60) పరకాల – కొండ సురేఖ
61) ములుగు – సీతక్క
62) పినపాక – రేగా కాంతారావు
63) మదిర – మల్లు బట్టి వక్రమార్క
64) కొత్తగూడెం – వనామ వెంకటేశ్వర రావు
65) భద్రాచలం – పోడెం వీరయ్య