‘కేసీఆర్ బ‌యోపిక్‌’ ఫస్ట్ లుక్..

220
Udyama Simham Movie
- Advertisement -

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో బయోపిక్ చిత్రాలకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితంపై బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ మూవీకి ‘ఉద్యమ సింహం’ టైటిల్ ఖ‌రారు చేశారు. న‌ట‌రాజ‌న్ (గిల్లిరాజా), సూర్య‌, పి.ఆర్.విఠ‌ల్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. పద్మనాయక ప్రొడక్షన్‌పై కల్వకుంట్ల నాగేశ్వరరావు క‌థ‌ను అందిస్తూ నిర్మిస్తోన్న చిత్రం. అల్లూరి కృష్ణంరాజు దర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

Udyama Simham

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను సోమ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేసీఆర్ బాల్యం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన సహా పలు అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తయిందనీ, ఈ నెల 16న సినిమా పాటలను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

- Advertisement -