నీట్‌ స్కామ్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌

5
- Advertisement -

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్. ఈ వ్యవహారంలో విచారణ జరిపించాలనే డిమాండ్‌పై బీజేపీ తీరు అత్యంత బాధ్యతారహితంగా ఉందదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్‌ ప్రశ్నాపత్నం లీకేజ్‌తో దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్ధులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇండియా కూటమి బలంతో ఇప్పుడు ప్రభుత్వ మెడలు వంచి విద్యార్ధులకు న్యాయం చేసేలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.నీట్‌ స్కామ్‌పై దృష్టిసారించాల్సిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార వేడుకలకు, విదేశాలకు వెళుతూ బిజీగా గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే జూన్‌ 4నే నీట్‌ రిజల్ట్స్‌ను ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, వీటి ఫలితాలపై ఎవరూ చర్చించే అవకాశం లేకుండా ఉంటుందనే ప్రభుత్వం జూన్‌ 4న నీట్ రిజల్ట్స్‌ను ప్రకటించిందని దుయ్యబట్టారు.

Also Read:40 శాతం మంది ప్రజలు మనవైపే:జగన్

- Advertisement -