ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో బీసీ నేతల భేటీ జరగనుంది. బీసీల సాధికారతపై సమావేశంలో చర్చ జరగనుంది. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు. కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు అన్నారు.
ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. నిన్న కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్ ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ మరోసారి కేసీ వేణుగోపాల్‌తో చర్చించనున్నారు.
Also Read:దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా..

