ఎంపీ గడ్డం వంశీ సంచలన వ్యాఖ్యలు

8
- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను… కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం ఇవ్వకపోవడంపై మంత్రి సీతక్క  ముందే బహిరంగ ఆరోపణలు చేశారు.

డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను, కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశాను అన్నారు. నన్ను ఆహ్వానించకపోవడంతో బాధపడ్డాను, రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలను వెళ్లొచ్చని మరొకసారి గుర్తుచేస్తున్నాను అన్నారు.

ఇక ఇవాళ సరస్వతీ పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు మంత్రి సీతక్క. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఏర్పాట్లు చేశారు అన్నారు. కాళేశ్వర క్షేత్రంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అన్నారు.

Also Read:కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడాలి: హరీష్

- Advertisement -