టీఆర్ఎస్‌లో కాంగ్రెస్‌ఎల్పీ విలీనం…

179
t congress
- Advertisement -

తెలంగాణలో రాజకీయ పరిణామాలు చకచక మారుతున్నాయి.తమను టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీలు ఆకుల లలిత,సంతోష్,ప్రభాకర్,దామోదర్ రెడ్డి ఛైర్మన్‌కు లేఖ అందించారు.

పొత్తుల వల్ల కాంగ్రెస్ నష్టపోయిందని..చంద్రబాబుతో పొత్తును ప్రజలు జీర్ణించుకోలేక పోయారి ఈ సందర్భంగా వారు తెలిపారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షించాయని.. ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో తమకు చాలా అవమాననాలు జరిగాయని.. కష్టపడే వాళ్లకు విలువ లేదని ఆరోపించారు. పైసలు ఉన్నవాళ్లకే కాంగ్రెస్‌లో విలువ అని మండిపడ్డారు.

కాంగ్రెస్ మండలి పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుల బలం కేవలం రెండుకు చేరే అవకాశముంది. మండలిలో ప్రస్తుతం కాంగ్రెస్ తరుపున షబ్బీర్ అలీ తో పాటు పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రమే మిగిలి ఉన్నారు. మార్చి లో వీరిద్దరి పదవి కాలం ముగియనుంది.

- Advertisement -