కన్నడ రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. సీఎం యాడ్యురప్ప ప్రమాణస్వీకారంపై కాంగ్రెస్,జేడీఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చేరాయి కన్నడ రాజకీయాలు. పార్క్ హయాత్ హోటల్లో కాంగ్రెస్,జేడీఎస్ ఎమ్మెల్యేలు బస చేశారు.
ముందుగా రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముందుగా కేరళకు ప్రత్యేక విమానంలో తరలించాలని అనుకున్నాయి. అయితే పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్ మార్చారు. ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య హైదరాబాద్ కు తరలించారు.
ఎమ్మెల్యేలను సురక్షితంగా కాపాడుకోవడానికి హైదరాబాదే సరైన ప్రదేశమని ఇక్కడికి తరలించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్క్ హయత్ హోటల్ వద్ద హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు బీజేపీ వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, జేడీఎస్.. తమ సభ్యులను ఎలాగైనా కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.