బీజేపీకి వర్తించని కోవిడ్ రూల్స్‌ కాంగ్రెస్‌కే వర్తిస్తాయా: జగ్గారెడ్డి

18
jaggareddy

బీజేపీకి వర్తించని కోవిడ్ రూల్స్ కాంగ్రెస్‌కే వర్తిస్తాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి..RSS శిక్షణ తరగతులకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది కానీ కాంగ్రెస్ శిక్షణ తరగతులకు అనుమతి ఇవ్వదా అని ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీ ని అడుగుతున్నా.. బిజెపి జాతీయ ప్రెసిడెంట్ నడ్డా కూడా వచ్చారు… వారికీ లేని కోవిడ్ మాకే ఉందా అని సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు.

సెంట్రల్ పోలీస్, కేంద్ర సర్కార్ బీజేపీది కాబట్టి అనుమతి వస్తదా… కాంగ్రెస్ కు.. రాష్ట్రంలో కేంద్రంలో పవర్ లేదని పర్మిషన్ ఇవ్వరా అన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడే శిక్షణ తరగతులను నిర్వహిస్తాం…. సంఖ్య పరంగా చూస్తే కాంగ్రెస్ ది 120 నుండి 150 మంది, RSS వాళ్ల మీటింగ్ కు 300మంది హజరయ్యారు.. ఎక్కడ వారు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదన్నారు. మాణిక్ ఠాగూర్ చేసిన ట్వీట్‌కు డీజీపీ వెంటనే స్పందిచాలన్నారు.