సీఎం కేసీఆర్‌పై జగ్గారెడ్డి ప్రశంసల జల్లు

136
jaggareddy
- Advertisement -

నిరుద్యోగులకు శుభవార్తను అందిస్తూ 80039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం ప్రశంసలు కురిపించారు.

ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న‌పై వ్య‌క్తిగ‌తంగా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాన‌ని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు. సీఎంను క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతాన‌ని చెప్పారు.

హౌసింగ్ విభాగాన్ని మ‌ళ్లీ తెర‌వాల‌ని సీఎంను కోరుతాన‌ని వెల్ల‌డించారు. బిస్వాల్ క‌మిటీ నివేదిక ప్ర‌కారం మిగ‌తా పోస్టులు భ‌ర్తీ చేయాల‌న్నారు. ఈ విష‌యంలో త‌మ పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవ‌న్నారు.

- Advertisement -