ఎవరితో లాలూచీపడను: జగ్గారెడ్డి

41
jaggareddy
- Advertisement -

తానేవరితో లాలూచి పడనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం చూస్తే, ఆమె మరో మార్గం లేక ఆ విధంగా మాట్లాడినట్టు భావిస్తున్నామని తెలిపారు.

తానెవరికీ బానిసను కాదని, ఎవరితోనూ లాలూచీపడనని…పేదవాడికి మేలు జరుగుతుందంటే ఎవరినైనా ఎదిరిస్తానని అన్నారు. కేసీఆర్ కిట్ వల్ల చాలామందికి ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు.

రాహుల్ గాంధీపై విమర్శలు చేసే నైతికత ఎవరికీ లేదని..ఎన్ని గేమ్ లు ఆడినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదని అన్నారు. కాంగ్రెస్ చరిత్ర కంటే తనకు బీజేపీ చరిత్రనే బాగా తెలుసని అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -