ప్రధాని అభ్యర్థిపై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ?

44
- Advertisement -

గత కొన్నాళ్లుగా ఇండియా కూటమిని ప్రధాని అభ్యర్థి అంశం తెగ వేధిస్తోంది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కూటమి తరపున ఎవరు ప్రధాని అభ్యర్థి అనే దానిపై అగ్ర నేతలంతా ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే కూటమిలోని పార్టీల అగ్రనేతలు పలుమార్పు సమావేశం అయినప్పటికి పిఎం అభ్యర్థిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం కూటమి తరుపున కొంతమంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ, నితీష్ కుమార్, మమతా బెనర్జీ.. వంటి వారు ప్రధాని రేస్ లో ఉన్నారు. అయితే కాంగ్రెస్ తరపున ఇటీవల మల్లికార్జున్ ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. ఆయనను ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకునేందుకు మెజార్టీ నేతలు సుముఖత చూపారని, ఖర్గే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపించింది.

అయితే ఇప్పుడు మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ టైమ్ లో ప్రధాని అభ్యర్థి పై కన్ఫ్యూజన్ ఏర్పడితే ఆ ప్రభావం ఎన్నికల్లో కూటమికి నష్టం చేకూరే అవకాశం లేకపోలేదు. అందుకే ప్రధాని అభ్యర్థి ప్రకటన లేకుండానే ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉందట ఇండియా కూటమి. ఎందుకంటే కర్నాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సి‌ఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల్లో ఘన విజయం సాధించింది హస్తం పార్టీ ఆ తరువాత సి‌ఎం ఎంపిక చేపట్టింది. సేమ్ అదే ప్లాన్ లోక్ సభ ఎన్నికల్లో కూడా ఫాలో అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారట హస్తం అగ్రనేతలు. ఈ వ్యూహానికి కూటమిలోని ఇతర నేతలు సైతం మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో లోక్ సభ ఎన్నికలకు ప్రధాని అభ్యర్థి లేకుండానే ఇండియా కూటమి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ ప్లాన్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Also read:రైతుబంధు ఇప్పట్లో లేనట్లే..?

- Advertisement -