కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు పంపారు. అనంతరం బీజేపీ చీఫ్ నడ్డా, బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మహేశ్వర్ రెడ్డి. ఓ వ్యక్తి స్వార్థ రాజకీయాల వల్ల కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయిందని ఆ పార్టీకి భవిష్యత్ లేదన్నారు.
కొంతకాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మహేశ్వర్ రెడ్డి. ఉత్తమ్ వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. అధిష్టానంతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనకు పీసీసీ షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మహేశ్వర్ రెడ్డిని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు బుజ్జగింపులు చేశారు. 13 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉంటున్న తాను.. పార్టీకి వ్యతిరేకంగా ఏనాడు మాట్లాడలేదని, నడుచుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ లోని కొందరు నాయకులు బీజేపీ అగ్రనాయకులతో కలిసినా వారికి ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా.. తనకు మాత్రమే ఇస్తారా..? అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..