కుర్చీ కోసం కాంగ్రెస్ లీడర్ల డిష్యూం..డిష్యూం

359
congress indirapark
- Advertisement -

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై ఇందిరా పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన అఖిలపక్ష ధర్నా రణరంగంగా మారింది. దీక్షా శిబిరం వద్ద కాంగ్రెస్‌ నేతలు వీహెచ్‌,నగేశ్‌ మధ్య కుర్చికోసం కొట్లాట జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన వీహెచ్‌… నగేశ్‌పై చేయిచేసుకున్నారు.

దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీహెచ్‌…నగేష్‌ని తోసేయడంతో ఆయన వేదికమీదున్న కోదండరామ్‌పై పడబోయారు. చనిపోయిన పిల్లల కుటుంబాలు ముందు ఇలా  కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ నేతలు కొట్టుకోవడంతో అఖిలపక్ష నేతలు బిత్తరపోయారు.ఈ కార్యక్రమంలో  చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కే, నారాయణ, టీడీపీ నేత ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. అయితే మిగితా నేతలు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

- Advertisement -