బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ నేతల ద్వంద్వ వైఖరి మంచిది కాదు అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు మా పోరాటం ఆగదు అన్నారు.
అన్నీ పార్టీలు బంద్ లో పాల్గొనడం శుభ పరిణామం అని… ఈ న్యాయమైన కోరికకు ప్రధాని మోదీ సహకరించాలని ఎందుకు అడగడం లేదు చెప్పాలన్నారు. రాష్ట్రంలో మద్దతు ఇస్తున్నారు, పార్లమెంటులో అడ్డుకుంటున్నారు… కులాలకు అతీతంగా మంత్రులు, కాంగ్రెస్ నేతలు అందరూ బీసీ బంద్ లో పాల్గొంటున్నారు అన్నారు. బీసీ బంద్ మరో తెలంగాణ ఉద్యమం అయ్యే అవకాశం ఉంది అన్నారు.
బీసీల పాపం బీజేపీకి తప్పక తగులుతుంది అన్నారు మంత్రి కొండా సురేఖ. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకున్నాం… సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కానప్పటికీ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్ధతు తెలిపిన బీజేపీ.. గవర్నర్ ఆమోదం తెలపకుండా అడ్డుకున్నారు అన్నారు. గవర్నర్ ఒక్క సంతకం పెట్టి.. బీసీ బిల్లుకి ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడా సమస్య వచ్చేది కాదు అన్నారు సురేఖ.
Also Read:BB9:కెప్టెన్సీ కోసం వింత టాస్క్‌లు

