కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ పార్టీకి ఐటీ శాఖ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదో చెప్పాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు.
మేం పాల్పడిన ఉల్లంఘనలను సమీక్షించేందుకు ఎటువంటి అంచనాలు చేశారో, అలాగే బీజేపీ ఉల్లంఘనలను తాము కూడా స్టడీ చేశామని దాని ప్రకారం బీజేపీ కట్టాల్సిన జరిమాన రూ.466 కోట్లు అని చెప్పారు. తమకు ఇచ్చిన పన్ను పెనాల్టీ నోటీసుపై మూడు సార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు.ఏప్రిల్ ఒకటో తేదీన సుప్రీం తన తీర్పులో ఊరట కల్పిస్తుందని ఆశిస్తున్నామని వెల్లడించారు.
బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతుందని, ఐటీ నోటీసులు తమ స్పూర్తిని దెబ్బతీయలేవని వెల్లడించారు సీనియర్ నేత జైరాం రమేష్. సత్యం కోసం తాము పోరాడుతూనే ఉంటామని, పన్ను ఉగ్రవాదంతో కాంగ్రెస్‌ను అటాక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:Nara Rohith:ప్రతినిధి 2 టీజర్