- Advertisement -
హైదరాబాద్ గాంధీభవన్లో మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కి వ్యతిరేకంగా గోషామహల్ నియోజకవర్గ మహిళ నేతలు నిరసన చేపట్టారు. సునీతా రావు హటావో..గోషామహల్ కాంగ్రెస్ బచావో… డౌన్ డౌన్ సునీతా రావు అంటూ నినాదాలు చేశారు నేతలు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవిలో ఉండి టీపీసీసీ ప్రెసిడెంట్ పై నిరాధార ఆరోపణలు చేసిన సునీతా రావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళ కార్యకర్తలు, నేతలు.
నిబద్ధతకు, క్రమశిక్షణకు మారు పేరైనా టీపీసీసీ చీఫ్ పై బురద జల్లే ప్రయత్నం చేసే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు గోషామహల్ నియోజకవర్గ నేతలు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని.. అందుకు నిదర్శనం సామాన్య కార్యకర్త నుంచి టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం అంటూ గుర్తు చేశారు నేతలు.
Also Read:ఓదెల 2…ఓటీటీలో సరికొత్త రికార్డు!
- Advertisement -

