జూబ్లీహిల్స్ ఓటు చోరీపై విచారణ

4
- Advertisement -

జూబ్లీహిల్స్ ఓటు చోరీ బాగోతంపై విచారణకు ఆదేశించారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. ఇటీవల ఓట్లు నమోదు చేయించి, దొంగ ఓటర్ ఐడీ కార్డులు పంపిణి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

యూసుఫ్ గూడ డివిజన్ కృష్ణానగర్‌లోని 8-3-231/బీ/160 ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదు అయ్యాయి. దీనిని సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.

యూసుఫ్‌గూడా బూత్ నంబర్ 246లో ఒకటే ఇంట్లో 43 ఓట్లు నమోదయ్యాయి. ఓవైపు దేశవ్యాప్తంగా ఓటు చోరీ అంటూ గగ్గోలు పెడుతున్న రాహుల్ గాంధీ.. మరోవైపు తెలంగాణలో ఓటు చోరికి కాంగ్రెస్ నేతలు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

Also Read:‘కారు’ కావాలా..’బుల్డోజర్’ కావలా: కేటీఆర్

- Advertisement -