- Advertisement -
ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేసేందుకు సిద్దమయ్యారు సోనియాగాంధీ.
ఏఐసీపీ ప్రధాన కార్యాలయంలో సోనియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. పార్టీ బలోపేతం, వర్గవిభేదాలపైనా ప్రధానంగా చర్చజరగనుంది.
పార్టీలో పెనుమార్పులు ఖాయమన్న వార్తలతో, సోనియా గాంధీ అధ్యక్షత జరిగే తాజా మీటింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో, దేశవ్యాప్తంగా ఆందోళనలపై కార్యాచరణను సోనియా ప్రకటిస్తారని తెలుస్తోంది.
- Advertisement -