ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం నీర్మాలలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో భారీగా నేతలు,కార్యకర్తలు చేరారు. ఇందులో తుమ్మ జైపాల్ రెడ్డి, మెట్టు విన్సెంట్ రెడ్డి, ఇమ్మన్యూల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, సందీప్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, వంశీ రెడ్డి, ఆదిత్య రెడ్డి, సంకీ ర్ త్, అల్లం సుందర్ రెడ్డి, తుమ్మ ఫిలోమిన, లుద్ది మేరీ, కెల్మెంటినా, తెరేజమ్మ, బాలసాని సుధ రెడ్డి తదితరులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
వాళ్ళందరికీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య కార్యకర్తలు వారధిలా పని చేయాలని చెప్పారు. పార్టీ కార్యకర్తలను అధినేత కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడే బాధ్యత తనదని మంత్రి చెప్పారు.