టీఆర్ఎస్లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి పలువురు నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం రెడ్డిపేట్ ఉపసర్పంచ్ బాలయ్య, వార్డు మెంబర్లు మహేశ్, సత్తవ్వ, రాజనర్సు రామవ్వ కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వంచ గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు రాజాగౌడ్, రాజేందర్, బుచ్చిరెడ్డి, గంగారెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో భారీగా చేరికలు..
- Advertisement -
- Advertisement -