కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి తెల్లం వెంకట్రావ్..

28
- Advertisement -

మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు భద్రాచలం కాంగ్రెస్ నేత తెల్లం వెంకట్రావ్. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వెళ్లడం అంటే కుక్కను పట్టుకొని గోదారిని ఈదడం లాంటిదనే విషయం మన వెంకట్రావు కి నెల రోజుల్లోనే అర్థమైందన్నారు.పార్టీలో తిరిగి చేరుతున్నందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయనతోపాటు ఆయన ద్వారా చేరిన పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందన్నారు.

ఒకప్పుడు కొమురం భీం కోరుకున్న జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుదని…ఒక్క వర్షాకాలంలోనే కోటి ఎకరాల జమీన్ లో పంటను తెలంగాణ ఈరోజు సాగు చేస్తుందన్నారు.తెలంగాణ మొత్తంగా భూమాత పచ్చ చీర కట్టుకున్నదా అన్న తీరుగా పంటలు పండిస్తున్నది మన రైతాంగం …ఒకప్పుడు మనం అనుకునే తెలంగాణ కోటి రతనాల వీణ… ఈరోజు కోటి ఎకరాల మాగానంగా మారింది. ఇది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందన్నారు.

ఒకప్పుడు మంచం పట్టిన మన్యం అనే వార్తలు వస్తుండే …ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నదా… ఇంటింటికి నీరు ఇవ్వాలన్న లక్ష్యాన్ని సాధించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మన ముఖ్యమంత్రి జాతిని మేల్కొల్పిన తర్వాత మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని జల్జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టిందని…
కాంగ్రెస్ పాలిత చతిస్గడ్ రాష్ట్రంలో… గోదావరి అవతల ఉన్న ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో నాలుగు లక్షల 50 వేలు ఎకరాల పోడుభూమి పట్టాలు ఇచ్చినట్లు ఛత్తీస్‌ఘడ్‌లో ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా రైతుబంధు వస్తది. మిషన్ భగీరథ నీళ్లు వస్తవి… ఆసరా పెన్షన్ వస్తది… కల్యాణ లక్ష్మి వస్తది… షాది ముబారక్ వస్తది. అవన్నీ జేబులో పెట్టుకొని కెసిఆర్ తిట్టడం.. విమర్శ చేయడం అలవాటుగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి… అందులోని నాయకులకి పదవులు రాకపోవడమే ప్రజల సమస్యగా చిత్రీకరిస్తే… ప్రజలు ఆదరించరన్న విషయం కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు.

Also Read:MP Santhosh:ఫొటోగ్రఫీ ఓ ఎమోషన్‌

గిరిజనులకి 10% రిజర్వేషన్ పెంచిన ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అని…పోడు భూములకు పట్టాలు ఇచ్చి ,గిరిజనులకు పంచాయతీలు ఏర్పాటు చేసి స్వయం పాలన అధికారం ఇచ్చి, రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్ ది కాదా ఆలోచించాలన్నారు.యాదాద్రి స్థాయికి తగ్గకుండా భద్రాద్రి రామాలయ అభివృద్ధిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చేస్తారు.. కచ్చితంగా ఆ బాధ్యత మేమే తీసుకుంటాం అన్నారు.తిరిగి అధికారంలోకి రాగానే… భద్రాద్రి రాముడి గుడిని అద్భుతంగా పునర్నిర్మిస్తాం..ఎవరికీ ఈ అనుమానాలు అవసరం లేదన్నారు.60 సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టి ప్రజలకు సంక్షేమం.. అభివృద్ధి అందజేయని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కొత్తగా వచ్చినట్లు మరొకసారి అవకాశం అడుగుతున్న మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ దరిద్రపు పాత పరిపాలన… వారి పథకాలను గుర్తించుకొని ఖమ్మం జిల్లా ప్రజలు… భారత రాష్ట్ర సమితి చేస్తున్న అభివృద్ధి.. సంక్షేమాన్ని చూసి భారీ ఎత్తున గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు… రానున్న శాసనసభ ఎన్నికల ఘనవిజయమే ప్రతిపాదిక కావాలన్నారు.

Also Read:Ram Pothineni:‘స్కంద’ సెకండ్ సింగిల్

- Advertisement -