జీఎస్టీ ఎగవేత..కాంగ్రెస్ నాయకుడు అరెస్టు!

3
- Advertisement -

జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత అరెస్టయ్యారు. రూ.28 కోట్ల మేర జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలపై బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్ (ఆరెంజ్ ట్రావెల్స్) ఎండీ సునీల్ కుమార్‌ను డీజీజీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్) అధికారులు అరెస్టు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్న వ్యాపారవేత్తలపై డీజీజీఐ అధికారులు ఇటీవల విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ జీఎస్టీ చెల్లింపుల్లో భారీగా అవకతవకలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. సంస్థ నిర్వహిస్తున్న లావాదేవీలకు సంబంధించిన పన్నును సమయానికి చెల్లించకుండా, రూ.28 కోట్ల జీఎస్టీని ఎగవేసినట్టు తేల్చారు.

అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, మూడు నెలల గడువు పూర్తయినా జీఎస్టీ బకాయిలను చెల్లించకపోవడంతో చర్యలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో 2017 జీఎస్టీ చట్టం ప్రకారం సునీల్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు డీజీజీఐ అధికారులు తెలిపారు.ఈ అరెస్టుతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.

Also Read:ఫాస్టింగ్‌పై అధ్యయనం..షాకింగ్ నిజాలు!

- Advertisement -