ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతలు ఆగ్రహం..

70
modi
- Advertisement -

ఈరోజు ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశంలో పెట్రో ధరల అంశంపై ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పెట్రోలు, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ రూ. 26 లక్షల కోట్లు సంపాదించారన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. ఆ డబ్బులను ప్రధాని రాష్ట్రాలకు పంచాడా?.. కేంద్ర ప్రభుత్వం సమయానికి రాష్ట్రాలకు జిఎస్టీ వాటాను అందించలేదు విమర్శించారు. వ్యాట్ ను మరింత తగ్గించమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మొదట సెంట్రల్ ఎక్సైజ్ తగ్గించి, ఆపై వ్యాట్ తగ్గించమని రాష్ట్రాలను కోరాలన్నారు పవన్ ఖేరా.

పెట్రోల్-డీజిల్‌పై హర్యానాలో అత్యధిక వ్యాట్ ఉందన్నారు కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ ఎస్ హుడా. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఇంధన ధరలు పెరుగుతాయి.. కానీ అంతర్జాతీయంగా గోధుమల ధరలు పెరిగినప్పుడు రైతులకు దానిపై కనీస మద్దతు ధర మాత్రం పెరగదు ఎద్దేవ చేశారు. ఇంధన ధరల పెంపుపై కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకుంటోందని దీపేందర్‌ ఎస్‌ హుడా మండిపడ్డారు.

అలాగే ప్రధాని వ్యాఖ్యలపై ఝార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా మండిపడ్డారు. నేటి సమావేశంలో ఆరోగ్య పరిస్థితుల కంటే ఎక్కువగా ప్రధాని పెట్రోల్, డీజిల్ అంశాలపై మాట్లాడి రాజకీయ భేటీగా మార్చారు అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లను ప్రధాని మోదీ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. దేశం మొత్తానికి ఒక విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు బన్నా గుప్తా.

- Advertisement -