ఆంబులెన్సులో వచ్చి మరి ఓటు వేసిన మాజీ మంత్రి

306
mukeshgoud
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖేష్ గౌడ్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆయన ఆసుపత్రి నుంచి ఆంబులెన్సులో నేరుగా ఓటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖేశ్ గౌడ్ అభివాదం చేశారు. ఓటు వేసిన అనంతరం ముఖేష్ గౌడ్ తిరిగా ఆంబులెన్సులో ఆసుపత్రికి వెళ్లారు. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు ముఖేశ్ గౌడ్. బీజేపీ అభ్యర్ధి రాజాసింగ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.

- Advertisement -