- Advertisement -
సినీ నటి,కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఖుష్బూ…ఇటీవలె బీజేపీ తీసుకొచ్చిన కొత్త విద్యాపాలసీని సమర్ధించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఖుష్బూపై సీరియస్ అయ్యారు.
ఇక అప్పటి నుండి ఆమె పార్టీ మారుతారని వార్తలు వెలువడుతుండగా ఖుష్బూ మాత్రం ఖండించలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఖుష్బూ త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఖుష్బూ రాజీనామా చేయడం,బీజేపీలో చేరుతారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దక్షిణాదిలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఖుష్బూ. సినిమాల్లో అగ్రనటిగా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
- Advertisement -