పెద్దలు జానారెడ్డికి కుంటభూమి లేదట..!

187
jana
- Advertisement -

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 11వ సారి బరిలో నిలిచారు పెద్దలు జానారెడ్డి. 8 సార్లు ఇక్కడి నుండి విజయం సాధించిన జానా…ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తుల వివరాలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

తనకు ఒక కుంట వ్యవసాయ భూమి, సొంత వాహనం కూడా లేదని పేర్కొన్నారు. అంఏతేగాదు నివాస భవనాలు కూడా లేవని.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో 600 గజాల స్థలం (విలువ రూ.2,73,80,000) ఉందని తెలిపారు. జానాకు రూ.36,21,930 విలువైన చరాస్తి, రూ.33,46,000 విలువైన స్థిరాస్తి ఉండగా ఆయన భార్య సుమతికి ఏకంగా రూ. 5,13,16,724 విలువైన చరాస్తి ఉందని వెల్లడించారు.ఇక జానా వద్ద రెండు లైసెన్స్‌డ్‌ తుపాకులు.. 32 బోర్‌ రివాల్వర్, 0.25 పిస్టల్‌ ఉన్నాయి.

అయితే తనకు భారీగా షేర్లు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు జానా. ఆరతి ఎనర్జీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.21,70,000 విలువైన ఈక్విటీ షేర్లు ఉండగా భార్య పేరున ఆస్థా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.3,85,74,560 విలువైన షేర్లు, ఆరతి ఎనర్జీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.34,26,640 విలువైన షేర్లు, తరండా హైడ్రో పవర్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌లో రూ.35,90,000 విలువైన షేర్లు ఉన్నాయి.

- Advertisement -