టీపీసీసీ నేతకు కరోనా పాజిటివ్…

267
guduru narayan reddy
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా తాజాగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కరోనా బారీ పడ్డారు.

నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్లు ధృవీకరించారని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.అయితే ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, త్వరగానే కోలుకుంటారని తెలిపారు.

లాక్‌డౌన్‌ సమయం లో నారాయణ రెడ్డి తన చారిటీ ట్రస్టు ద్వారా పేదలకు అండగా నిలిచారు. వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూనే సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

- Advertisement -